ధోనీ సైలెన్స్.. ఇక కోహ్లీనే తేల్చాలి

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లే ఓ నిర్ణయం తీసుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ప్రపంచకప్‌ ముగిసి రెండు నెలలు గడుస్తున్నా.. ధోనీ మాత్రం ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. దీంతో.. అతని భవితవ్యాన్ని కోహ్లీ, సెలక్టర్లే తేల్చాలని గంగూలీ వెల్లడించాడు.

సిరీస్‌ ఏదైనా.. జట్టు ఎంపికకి ముందు కెప్టెన్‌తో సెలక్టర్లు చర్చిస్తారు. కెప్టెన్ అంగీకారం లేకుండా.. జట్టులోకి కొత్త ఆటగాళ్లని ఎంపిక చేయడం, ఉన్న వాళ్లపై వేటు వేయడం సాధారణంగా జరగదు. ఇది బహిరంగ రహస్యమే. దీంతో సుదీర్ఘకాలం భారత కెప్టెన్‌గా పనిచేసిన సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు. దక్షిణాఫ్రికాతో తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో ధోనీని పక్కనపెట్టిన సెలక్టర్లు.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ధోనీ భవితవ్యం గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా సెలక్టర్లు ఏమి ఆలోచించారో..? నాకు తెలియదు. కానీ.. వారు ఓ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే.. వాళ్లే ఇకపై ధోనీ భవితవ్యాన్ని తేల్చగలరు’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*