ఎప్పుడు లేనంత ఒత్తిడిలో రిషభ్‌ పంత్

ప్రతిభావంతుడైన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు. ఓవైపు టీ20 ప్రపంచక్‌పనకు ముందు తమకు లభించిన నాలుగైదు అవకాశాల్లోనే యువ ఆటగాళ్లు సత్తా నిరూపించుకోవాలని కెప్టెన్‌ కోహ్లీ సూటిగా చెబుతున్నాడు. కానీ పదే పదే చాన్స్‌ లభిస్తున్నా.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అపార నమ్మకముంచుతున్నా రిషభ్‌ పంత్‌ మాత్రం దారిలోకి రావడం లేదు. 2017 ఫిబ్రవరిలో పంత్‌ భారత జట్టులోకి వచ్చాడు.

అన్ని ఫార్మాట్లలోనూ అతడికి ఏకంగా తుది జట్టులోనే చోటు దక్కుతోంది. కానీ క్రీజులో కుదురుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్‌ను పారేసుకోవడం అందరికీ చిర్రెత్తిస్తోంది. అటు కోచ్‌ రవిశాస్ర్తి కూడా ఈ పద్ధతి మార్చుకోవాలని ఘాటుగానే సూచించాడు. అందుకే ఈ సిరీ్‌సలో బ్యాట్‌ ఝుళిపించకపోతే సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల రూపంలో అతడికి ప్రమాదం ఉందని చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*