ఐదేళ్లలో 5 లక్షల కోట్లు దోచుకున్న బాబు

చంద్రబాబుపై ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పోలవరం రివర్స్ టెండర్లలో నష్టం అంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో దోచుకున్నది ఐదు లక్షల కోట్లు అని కడిగిపారేశారు. వరుస కరువు వల్ల వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయిందని.. వాటి గురించి మాట్లాడు బాబు అంటూ చురకలంటించారు.

బొగ్గు అందక నిలిచిన విద్యుత్ కేంద్రాలపై చంద్రబాబు, ఆయన మీడియా బానిసలు నిందలు వేస్తున్నాయని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. బాబు పాద మహిమతో ఐదేళ్లపాటు పడకేసిన జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థామర్థ్యంతో ఇప్పుడు జగన్ పాలనలో వానలు పడి పనిచేస్తున్నాయని విజయసాయిరెడ్డి ట్వీట్ తో విరుచుపడ్డారు. మంచిరోజులు వచ్చినట్టు తెలియడం లేదా అని నిలదీశారు.

ఇక తమిళనాట డీఎంకే పార్టీ మురసోలి, శివసేన సామ్నా పత్రికలు ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు చీల్చిచెండాడిన నైతిక విలువలు పాటిస్తాయని.. అవాస్తవాలు రాయవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మౌత్ పీసు ‘కిరసనాయిలు’ మాత్రం జర్నలిజం ముసుగులో విషయం కక్కుతున్నాడని విజయసాయిరెడ్డి చంద్రబాబు సన్నిహిత ఎల్లో మీడియా అధినేతపై సంచలన కామెంట్ చేశఆరు.

వలంటీర్లవి మూటలు మోసే పని అని ఎద్దేవా చేసిన టీడీపీ నేతలను త్వరలోనే మహిళలు చెప్పులతో కొడతారు అంటూ విజయసారెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకలకు ఆ గతి పడుతుందని ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*