లిఫ్ట్ లో ఎందుకు అద్దాలు ఉంటాయో తెలుసా ?

షాపింగ్ మాల్స్, అపార్ట్ మెంట్స్ , ఆఫీసులు.. ఇలాంటి వాటిలో లిఫ్ట్ లు ఇప్పుడు సర్వసాధారమైపోయాయి. కొంతమంది వీటిని లిఫ్ట్ లు అంటే.. మరికొంత మంది ఎలివేటర్స్ అంటారు. చాలాసార్లు లిఫ్ట్ లు మీరు ఎక్కి ఉంటారు. అయితే ఎప్పుడైనా వాటిలో ఎందుకు అద్దాలు ఉంటాయో మీరు ఆలోచించారా? వీనుల విందైన సంగీతాన్ని ఎందుకు లిఫ్ట్ లో ప్లే చేస్తారో తెలుసా.? అద్దాలు సెల్ఫీ కోసం మేకప్ సరి చూసుకోవడం కోసం అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్లే..

లిఫ్ట్ లు ప్రవేశపెట్టిన తొలినాళ్ళలో అద్దాలు లేవు. ఇప్పటికే చాలా వాటిలో లేవనుకోండి. దీంతో వాటిని ఉపయోగించే వాళ్లు లిఫ్ట్ ఎక్కినప్పుడు భయాందోళనకు గురయ్యారట. ఒక్కడే లిఫ్ట్ లో ఉండే టప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందట. మూడు నాలుగు ఫ్లోర్లు వరకు అయితే పర్వాలేదు కానీ మరి ఓ పదిహేను రోజులు అయితే చాలా కష్టం. దీంతో తయారీదారులకు వచ్చిన ఆలోచన ఈ అద్దాలతో తయారు చేసిన లిఫ్ట్. అద్దాలతో ఉండడం వల్ల బయటకు ఏం జరుగుతుందో.. మనం ఎంత మీదకు వెళ్లామో తెలుస్తుంది. సుందరమైన ప్రదేశం చూస్తూ పైకి ఎక్కడం వల్ల ఒక్కరమే ఉన్నాననే భావన కలగకుండా ఉంటుంది. ఈ ఆలోచనతో లిఫ్ట్ కదులుతున్న విషయాన్ని చాలా మంది మరిచిపోతారు.

అందుకే ఇప్పుడు మొత్తం అద్దాలతో తయారు చేసిన ఎలివేటర్లు వస్తున్నాయి. దీంతోపాటు కొందరికి క్లాస్త్రోఫోబియా అనే భయం ఉంటుంది. ఖాళీ తక్కువగా ఉండే ప్రాంతం ఉన్న ప్రదేశాలలో ఉండాలన్నా.. లిఫ్ట్ లో ఇరుకు గదిలో నుంచి ప్రయాణించాలన్నా భయం కలుగుతుంది. ఇలాంటి తత్వం ఉన్న వారు కూడా ఈ అద్దాల వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఇప్పుడు అద్దాలతో చేసిన లిఫ్ట్ లు వచ్చేశాయి.. ఇదండీ అద్దాల లిఫ్ట్ ల కథ..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*