ప్రపంచంలోనే ఈ విమానాల వేగం, మైలేజ్ అదుర్స్

విమాన ప్రయాణం చాలామందికి సరదా. గాల్లో తేలుతున్నట్లు, మబ్బుల పైన ప్రయాణించవచ్చని ఆ సరదా. గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని కూడా ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఇష్టపడతారు. విమానాల వేగం ప్రధానంగా వాటి సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.అయితే ఒక విమానం ఒకే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం అన్నిసందర్భాల్లోనూ ఒకేరకంగా ఉండదు, హెచ్చు తగ్గులుంటాయి.

ఉత్తరార్థ గోళంలో గాలులు పడమర నుంచి తూర్పుకి వీస్తుంటాయి. ఈ గాలులు విమానాన్ని ముందుకు తోస్తాయి. తిరుగు ప్రయాణంలో అదే విమానం గమ్యం చేరడానికి అరగంట ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. గాలులు ఎదురు నుంచి వీయడమే అందుకు కారణం. ఒక విమానం.. న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లడానికి పట్టే సమయం కంటే తిరుగు ప్రయాణానికి అరగంట ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది.

దేశవిదేశాలకు ప్రయాణించడానికి ఉన్న ఏకైక రవాణా మార్గం విమానాలే.. ఖండాతరాలలోని సుదూరం దేశాలను కేవలం కొన్ని గంటల్లోనే చేరుకుంటున్నాము. ఇందుకు అధిక వేగంతో ప్రయాణించే విమానాలు కీలకం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఐదు విమానాలనే దూర ప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తున్నాయి.

దూర ప్రాంత ప్రయాణాలకు ఎయిర్‌లైన్స్ సంస్థ ఎక్కువగా ఎంచుకుటున్న విమానాల్లో బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి. బోయింగ్ 777 విమానం యొక్క గరిష్ట వేగం గంటకు 1037కిలోమీటర్లుగా ఉంది.ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే 13,649కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది.

ఆ తర్వాత బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సిరీస్ విమానం దూర ప్రాంత ప్రయాణాలకు ఎంచుకుంటున్న విమానాల్లో ఒకటి.ఈ విమానం గరిష్ట వేగం గంటకు 1050 కిలోమీటర్లు. విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 11,908 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది.

ఎయిర్‍‌బస్ ఏ380. ప్రపంచపు అతి పెద్ద ప్యాసింజర్ విమానంగా నిలిచిన ఎయిర్‌బస్ ఏ380లో గరిష్టంగా 544 మంది వరకు ప్రయాణించవచ్చు. ఏ380 విమానం యొక్క గరిష్ట వేగం కూడా 1050 కిలోమీటర్లుగానే ఉంది.ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 15,200 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది.

బోయింగ్ 747-400 ప్యాసింజర్ ప్లేన్ కూడా డబుల్ డెక్కర్ విమానం.బోయింగ్ 747-400 విమానం గరిష్ట వేగం గంటకు 1056 కిలోమీటర్లు. ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 7,585కిమీల వరకు నాన్-స్టాప్‌గా ప్రయాణిస్తుంది.

బోయింగ్ 747 థర్డ్ జనరేషన్ వెర్షన్ 747-8 విమానాన్ని 2005లో పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో దేశాధ్యక్షులు ఈ విమానాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. అందులో అమెరికా అద్యక్ష విమానం కూడా ఇదే. బోయింగ్ 747-8 విమానం ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంతో ప్రయాణించే విమానం. దీని గరిష్టం వేగం గంటకు 1062 కిలోమీటర్లుగా ఉంది. దీని గరిష్టం వేగం గంటకు 1062 కిలోమీటర్లు (0.86 మ్యాక్)గా ఉంది.

ఇక మధ్యతరహా, చిన్న విమానాల వేగం, మైలేజీ వీటికి కిందనే చాలా తక్కువగా ఉంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*