ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – అలవైకుంఠపురంలో సాంగ్స్

తెలుగులోనే కాదు యావత్ సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీ గా ఆదిత్య మ్యూజిక్ వారు అందరికి సుపరిచితం. గత ముప్పై ఏళ్ళు గా అనేకనేక సూపర్ హిట్ ఆడియో ఆల్బమ్స్ ని తెలుగు శ్రోతలకు ఆదిత్య మ్యూజిక్ వారు అందిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన అల వైకుంఠపురంలో ఆడియోకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ఈ సినిమాలో పాటల అన్ని వర్గాలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి.

ఇప్పటుకే ఈ ఆడియో ఆల్బమ్ వివిధ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో రోజుకో రికార్డు క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిత్య మ్యూజిక్ వారికి సంబందించిన యూట్యూబ్ ఛానల్ లో అల వైకుంఠపురంలో ఆల్బమ్ కి 1 బిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. దీంతో ఆదిత్య మ్యూజిక్ పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. సౌత్ ఇండియా లో ఇప్పటి వరకు యే మ్యూజిక్ ఆల్బమ్ కి ఒకే ప్లాట్ ఫామ్ లో ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ మ్యూజిక్ బ్లాక్బస్టర్ రికార్డు అలవైకుంఠపురం ఆల్బమ్ కారణంగా ఆదిత్య మ్యూజిక్ సొంతం అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*