కార్మికుల కరువులోనూ పోలవరంలో ‘మేఘా’ పరుగులు

కరోనా కష్టకాలంలో వలస కార్మికులు తరలిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టుల పనులు ఆగిపోయినా పోలవరంలో మాత్రం పరుగులు పెడుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాన్ని జట్ స్పీడులో పూర్తి చేస్తుందని పేరున్న మేఘా సంస్థ చేపట్టిన పోలవరంలో కూడా అదేవిధంగా పనులు పరుగులు పెట్టిస్తోంది. ఇంత కరువుతోనూ కార్మికులు తరలిపోయినా పోలవరంలో మాత్రం మేఘా వెనక్కితగ్గకపోవడం.. ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తుండడంపై ఏపీ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాలాక్ డౌన్ తో బతుకు భయంతో కార్మికులు భయాందోళనలకు గురై తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో మంచి వలస కార్మికులు లేక దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనులు దాదాపు ఆగిపోతున్నాయి. కానీ ఏపీ కలల ప్రాజెక్టుపోలవరంను మాత్రం పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పరుగులు పెట్టిస్తోంది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులోని పనులన్నీ ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. మేఘా సంస్థ ముమ్మరంగా పనులు చేస్తోంది.

కరోనా సమయంలో సమస్యలు ఉన్నా ప్రపంచంలోనే అతిపెద్ద వరద నీరు ప్రవహించే భారీ స్పిల్వేను మేఘా పోలవరంలో నిర్మిస్తోంది. ప్రాజెక్ట్లోని ప్రధానమైన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్పిల్వే, స్పిల్ఛానెల్, అప్రోచ్చానెల్, పైలెట్ఛాన్లెతో పాటు  ఎర్త్కమ్ర్యాక్ఫిల్డ్యాంతో సహా 1,2,3 (గ్యాప్లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్కేంద్ర నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి.

చంద్రబాబు వదిలేసినా.. వదలని జగన్

గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టింది. 2018లో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. కమీషన్ల కక్కుర్తిలో ప్రజలకు తాగు, సాగునీరందించే బహుళార్థక సాధక ప్రాజెక్టును విస్మరించిందన్న విమర్శలున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి దీనిపై వాయువేగంగా స్పందించారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసి కొత్తగా రివర్స్ టెండర్లు పిలిచారు. తద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి నిధులు ఆదా చేసి సంచలనానికి నాందిపలికారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థ.. వేగంగా పనులు చేసేమేఘాచేతిలోకి పోలవరం వచ్చేసింది. మేఘా చిరుతలా వేగంగా పనులు చేస్తూ జట్ స్పీడుతో పనులు పూర్తి చేయిస్తోంది.

పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే నిర్మాణం

ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్జలాశయ స్పిల్వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్లో 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్స్పిల్ వే నిర్మిస్తుండడం విశేషం. ప్రాజెక్ట్లో 50 లక్షల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్వేను మేఘా ప్రణాళికబద్దంగా నిర్మిస్తున్నారు. 2019 నవంబర్లో మేఘా పనులను ప్రారంభించింది.గత ప్రభుత్వం ఇంజనీరింగ్పద్ధతిలో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా వరద నీరు చేరింది. దీంతో దాదాపు 4 టిఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది. తరువాత జనవరిలో పనులు వేగవంతం చేయడం సాధ్యమైంది. నిర్మాణ పనులకు వేసవి కాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు కీలకమైనవి కాగా కరోనా కష్టాలతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్నిర్మాణ పనులు మందగించాయి. పోలవరం నిర్మాణంపై కూడా ప్రభావం పడింది.

పోలవరం నుంచి వెళ్ళిపోయినా వలస కార్మికులు

పోలవరం నిర్మాణంలో బీహార్, ఝార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన కూలీలదే కీలక పాత్ర. కానీ కరోనా లాక్ డౌన్ భయంతో దాదాపు 2000 మందికి పైగా కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అయినప్పటికీ పనులు ఆగిపోకుండా ముందుకు సాగించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్సమర్థంగా వ్యవహరించాయి. పనుల్లో స్పిల్వే, స్పిల్ఛానెల్, జల విద్యుత్కేంద్రం, మట్టి, రాతి పనులు కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి. నవంబర్‌-డిసెంబర్నెలలో నీటి సమస్య వల్ల మందకోడిగా జరిగాయి. జనవరి నుంచి 20639 ఘనపు మీటర్లు జరిగి పనులు ఊపందుకున్నాయిఫిబ్రవరిలో 32443, మార్చిలో 36129 ఘనపు మీటర్ల స్పిల్వే, స్పిల్ఛానెల్కాంక్రీట్పనులు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కరోనా ప్రభావం పోలవరంపై పడకుండా అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి.

కరోనా సమయంలో కష్టాలు... కార్మికులకు మేఘా వసతులు

కరోనా సమయంలో కార్మికుల సమస్యలతో పాటు ముడి సరుకు ముఖ్యంగా సిమెంట్, స్టీల్ఇతర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా వ్యవస్థ ఏప్రిల్, మే నెలల్లో స్తంభించిపోవడం వల్ల అవసరమైన ముడిసరుకు ప్రాజెక్ట్కు చేరకపోవడంతో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. పనులు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, కంపెనీ సిబ్బంది దానిని అధిగమించడానికి శతవిధాల ప్రయత్నించాల్సి వచ్చింది. అదే సమయంలో కార్మికులు కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో మెడికల్క్యాంపు ఏర్పాటు చేసింది. అలాగే వారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అందచేశారు మెడికల్క్యాంపులో నిత్యం అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. కరోనా కాలంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్కూడా ఇస్తున్నారు.

స్పిల్ చానల్ పనులు.. శ్రమించిన మేఘా సిబ్బంది

గత ప్రభుత్వం వదిలేసిన పోలవరం స్పిల్ వే పనులు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం మీద 53263 ఘనపు మీటర్ల పనిని మే నెలలో చేశారు.కరోనాని సైతం ఎదుర్కొని మేరకు పనిచేశారంటే ప్రభుత్వంమేఘా చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. కార్మికులు వెళ్లిపోయినా కొంతమందిని తీసుకొచ్చి ఇంజనీర్ల ద్వారా మేఘా పనులు చేసింది.

కీలక పనులు చేసిన మేఘా

ప్రాజెక్ట్లో మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం, మట్టికట్ట నిర్మాణం, జల విద్యుత్కేంద్రం పనులు, ఎర్త్కమ్ర్యాక్ఫిల్డ్యాం పనులు కీలకమైనవి. గత చంద్రబాబు పాలనలో పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయిప్రాజెక్ట్లో స్పిల్వే కాంక్రీట్, లోయర్కాఫర్డ్యాం, అప్పర్కాఫర్డ్యాం నిర్మాణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్ట్లో అన్ని పనులు సకాలంలో పూర్తయితేనే ప్రాజెక్ట్ప్రయోజనం నెరవేరుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్వే కాంక్రీట్పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎర్త్కమ్ర్యాక్ఫిల్డ్యాం (3 గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు (వైబ్రో కంప్యాక్షన్పనులు) మేఘా ఇంజనీరింగ్చేపట్టింది. అలాగే స్పిల్ఛానెల్పనులు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్ఛానెల్కు సంబంధించిన కాంక్రీట్బ్లాక్నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. జల విద్యుత్కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్‌) పనులు ఊపందుకున్నాయి. జలవిద్యుత్ కేంద్రంకోసం ఇక్కడ ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్కప్లాంగ్టర్బైన్లను ఏర్పాటు చేయాలి.

మేఘాపై నమ్మకంతో తిరిగివస్తున్న కార్మికులు..

ఏపీ ప్రభుత్వం వలస కార్మికులను కడుపులో పెట్టుకోవడం.. మేఘా సంస్థ అత్యుత్తమ వసతులు కల్పించడంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి వస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు మేఘా బస్సలు, రైళ్లతో పాటు ప్రత్యేక మెడికల్టీం ఏర్పాటు చేసింది. ఇలా వచ్చే కార్మికులకు ప్రత్యేక మెడికల్టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా 1800 మంది తిరిగి వచ్చారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఏదేమైనా తిరిగి వచ్చే కార్మికుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది మేఘా సంస్థ.

మేఘా నమ్మకంతో తిరిగివస్తున్న కార్మికులు

ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తూ పనుల్లో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా సంస్థ దాదాపు 2000 మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొచ్చింది. ఇలా వచ్చినవారికి ప్రత్యేక ఇన్సెంటివిఎస్ తో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.  అలాగే ప్రత్యేక మెడికల్టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఏదేమైనా తిరిగి వచ్చే కార్మికుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది మేఘా సంస్థ.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*