పోలవరం ఎలా నడుస్తోంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి?

  • ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డర్ల ఏర్పాటు
  • కీలకమైన దశకు చేరిన ప్రాజెక్ట్ పనులు

ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలున్న పోలవరం ప్రాజెక్ట్ మరో విశిష్టతను సంతరించుకోనుంది. ప్రపంచంలో తొలిసారిగా హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా పనిచేసే గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.  ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పని ప్రారంభించారు. ఈ రోజు నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు.  సాధారణంగా ఇపప్పుడున్న జలాశయాలలో ఎలక్ర్టోమెకానికల్ ద్వారా గేట్లను ఎత్తడం దించడం చేస్తారు.  దీనివల్ల నిర్వాహణ వ్యయంతో పాటు తరచూ ఎత్తడం దించడం కోసం వాడే ఐరన్ రోప్ మార్చాలి వస్తుంటుంది. పోలవరంలో మాత్రం ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఎంఈఐఎల్ హైడ్రాలిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.

ఏపీ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు దశాబ్దాల క్రితమే పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. బ్రిటిష్ కాలంలో రూపొందిన ఈ ప్రాజెక్టు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపనకు నోచుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రజల నీటి అవసరాలు తీరుతాయని అందరూ భావించారు. ఆయన అకాల మరణంతో ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు నిలిచిపోయింది. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును కమిషన్లు, గ్రాఫిక్సే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఈ ప్రాజెక్టు నత్తను తలపించేలా పనులు సాగాయి.

కీలక దశలోకి పోలవరం పనులు..

ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణం చేశాక పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టడం ప్రారంభమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును త్వరితంగా నిర్మించి ఏపీ ప్రజల నీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగిస్తున్నారు. జగన్మోరెడ్డి ఆశయాలకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ వడివడిగా నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం పోలవరం పనులు కీలక దశకు చేరుకున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద గడ్డర్ల ఏర్పాటు..

పోలవరం పనులు కీలక దశకు చేరుకున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద గడ్డర్ల ఏర్పాటు పనులు పోలవరం ప్రారంభమైయ్యాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పర్యక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనుల్లో సింహభాగం పూర్తి అయినట్లే. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టే సమయానికి పియర్స్‌ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 52మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇక్కడ అందరు ఒకటి గుర్తించాల్సి ఉంది. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప విషయమే కాదు.. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది అత్యంత క్లిష్టమైన పని. ఈ పనిని కూడా పోలవరంలో చేయడం విశేషం.

ఒక్కో గడ్డర్ బరువు 62టన్నులు..

పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు ఉంటుంది. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్త 196 గడ్డెర్లకు గాను 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. స్పిల్‌వేపై గడ్డెర్లను ఒక క్రమ పద్ధతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజు సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై  కాంక్రీట్‌తో రోడ్‌ నిర్మిస్తారు. ఈ రోడ్‌ నిర్మాణానికి సుమారు ఐదువేల  క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ అవసరం అవుతుంది. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండునెలల్లోనే సిద్ధం చేయగా మిగిలిన వాటిని కూడా సిద్ధం చేస్తున్నారు.

వానాకాలంలో కూడా నిరంతరాయంగా పనులు..

గడ్డర్లు, కాంక్రీట్ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. దీంతో స్పిల్‌ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్‌వేలో ఒకవైపు గడ్డెర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు నిరంతరం కొనసాగేలా మేఘా సంస్థ చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్డర్‌ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్‌ నిర్మాణం పూర్తయితే గోదావరికి ఎంత వరద వచ్చినా గ్యాప్‌ 1, 3, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (గ్యాప్‌ 2) పనులు నిరాటంకంగా చేసుకోనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

జెట్ స్పీడుతో పోలవరం పనులు..

పోలవరం పనులను మేఘా సంస్థ జెట్ స్పీడుతో చేపడుతోంది. ఏపీ ప్రజల సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారంగా పనులను వాయువేగంతో ఉరకెలేత్తిస్తోంది. మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో  పనులు సాగుతున్నాయి.

బహుళార్థ ప్రాజెక్టుగా పోలవరం..

ఏపీ ప్రజలు సాగు, తాగునీటి అవసరాలతోపాటు విద్యుత్ అవసరాలను తీర్చేలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టు కింద 7.2లక్షల ఎగరాలకు సాగునీరు, 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. అంతేకాకుండా 80టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణానదికి తరలించటం చేస్తారు. 23.44 టీఎంసీల నీటిని విశాఖ నగర తాగునీటి అవసరాలకు తరలించటంతోపాటు 540 గ్రామాల్లోని 28.5 లక్షలమంది ప్రజల దాహార్తిని తీర్చేలా పోలవరాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరంలో మేఘా చేస్తున్న పనుల చాలా కీలకమైనవి. అవి మిగిలిన స్పిల్‌వే పూర్తిచేయటంతోపాట, ఎర్త్ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌), అనుబంధ పనులు, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణం, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయటం వంటివి ఉన్నాయి.

సీఎం జగన్ పర్యవేక్షణతో పనులు వేగవంతం..

దివంగత రాజశేఖర్ ఆశయం మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన పనులపై రివర్స్ టెండర్ నిర్వహించి మేఘా సంస్థకు జగన్మోహన్ రెడ్డి ఈ పనులను అప్పగించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి కొంత ఆదాయన్ని మిగిల్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో నిర్మించిన పోలవరం గ్రాఫిక్స్ కు బ్రేక్ పడింది. అసలు సిసలు పనులను మేఘా సంస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మొదలెట్టింది.  ప్రస్తుతం పోలవరం పనులు గోదావరి ప్రవహంలా ఉరకెలెత్తుతున్నాయి. త్వరలోనే ఏపీ ప్రజల డ్రీమ్ ప్రాజెక్టు పూర్తికానుండటంతో ప్రతీఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*