
తాడేపల్లి: రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా ప్రవర్తించడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ప్రవర్తన సరిగ్గాలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ నాయకులతో హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. ఓ వైపు ఎస్ఈసీ అని చెప్పుకుంటూ.. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్న నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ ధ్యేయమని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదోరకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. శవాలపై కూడా రాజకీయం చేసే దుర్భుద్ధి చంద్రబాబుదని, పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని ఫైరయ్యారు.
Leave a Reply