రాయచోటికి జిల్లా కావడానికి అన్ని అర్హతలున్నాయి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటిని ప్రత్యేక జిల్లా చేయాలని కోరారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.ఇప్పటికే రాయచోటి జిల్లా ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 18మండలాలకు రాయచోటి కేంద్ర బిందువుగా ఉందన్నారు. ఒకవేళ రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయకపోతే కడపలో కలపాలని సీఎం జగన్ ను కోరుతానని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు.

తాజాగా రాయచోటిలో విలేకరులతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటి జిల్లా కావడానికి ఉన్న అర్హతలు ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్ జిల్లాలో కోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీకి రాయచోటిని జిల్లా చేయాలని నివేదిస్తానని తెలిపారు.

ఎన్నికలకు ముందే తాను సీఎం జగన్ ను ప్రతీ పార్లమెంట్ ను జిల్లా చేయాలని కోరానని.. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని.. కేంద్రం నుంచి నిధుల కూడా జిల్లాలు పెరిగితే నిధుల లభ్యత పెరుగుతాయని సూచించామని.. జగన్ కూడా ఇదే మాట అన్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పారన్నారు.

అధికారుల కమిటీ నివేదికలు, అభిప్రాయాల ఆధారంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తారని.. ఎంతో వెనుకబడిన ఈ నియోజకవర్గం.. అభివృద్ధికి దూరంగా ఉన్న రాయచోటిని జగన్ నిధులు మంజూరు చేస్తూ సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తున్నారన్నారు.

చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాకు, రాజంపేట పార్లమెంట్ కు 18 మండలాలకు సెంటర్ గా రాయచోటి ఉందని.. అందుకే జిల్లాను చేయాలని న్యాయం చేయాలని జగన్ ను కోరుతామని అన్నారు.లేదంటే తమను కడప జిల్లాలోనే కొనసాగించాలని సీఎం జగన్ ను కోరుతామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కొత్త జిల్లాల విషయంలో ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకుండా.. ప్రజలకు ఏం అవసరం.. ఎక్కడ జిల్లా ఉండాలనే దానిపై అధికారుల కమిటీకి నివేదిస్తానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మనకు మెరిట్స్ ఏమున్నాయి? అనే దానిపై శాంతిపూర్వకంగా చర్చించుకుంటామని.. నా వరకు నా వంతు ప్రయత్నం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

రాయచోటి జిల్లాకు అనుగుణంగా అన్ని రకాలుగా సెంటర్ గా ఉందని.. 18 మండలాలకు కేంద్రంగా ఉందని.. అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా రాయచోటి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ క్రమంలోనే రాయచోటిని జిల్లా చేస్తారన్న విశ్వాసం ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

రాయచోటి జిల్లా అయితే మరింత అభివృద్ధి చెందుతుందని.. ఈ మేరకు కమిటీకి రిపోర్టు అందిస్తానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బాధ్యత తీసుకుంటానని ఆయన తెలిపారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సెంటర్ అయిన రాయచోటిని జిల్లా చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*