శ్రీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం గారి మ‌ర‌ణం మాకు తీరని లోటు – టీమ్ ఆదిత్య మ్యూజిక్

గాన గంధ‌ర్వ‌డు ప్ర‌ముఖ గాయ‌క‌లు శ్రీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం గారు సెప్టెంబ‌ర్ 25 మ‌ధ్యాహ్నం 1 గం 4 నిల‌కు తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత‌ ఉమేశ్ గుప్త‌, మాట్లాడుతూ, బాలుగారు ఇక లేర‌నే వార్త మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ‌ సిబ్బందితో పాటు యావ‌త్ ప్ర‌పంచంలో ఉన్న సంగీత అభిమానుల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. దాదాపు 50 ఏళ్లుగా సంగీత ప్ర‌పంచానికి ఆయ‌న అందించి సేవలు అనిత‌ర సాధ్యం. తెలుగులో ఆయ‌న పాడిన పాటల్లో కొన్ని సూప‌ర్ హిట్ సాంగ్స్ మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసే అదృష్టం ద‌క్కింది. అటు సినిమా పాట‌లు పాడుతూనే ఇటు భ‌క్తిర‌స పాట‌లు కూడా ఆల‌పించేవారు శ్రీ బాలుగారు.

అలా ఆయ‌న పాడిన భ‌క్తి ర‌స పాట‌ల్లో మా సంస్థ ద్వారా విడుద‌ల చేసిన హ‌నుమాన్ చాలీసా, శివోహం వంటి మొదలగు పాట‌లు విశేష ఆద‌ర‌ణ సంపాదించుకున్నాయి. మూడు ద‌శాబ్ధలు నుంచి బాలుగారుతో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్ర‌యాణం కొన‌సాగుతోంది. ఆయ‌న మ‌ర‌ణం మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్ధ‌కు తీర‌ని లోటుగా భావిస్తున్నాము. అయితే బాలుగారు భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న అద్భుత‌మైన గాత్రం ద్వారా మ‌నంద‌రితోనే ఉన్నార‌ని మేము విశ్వ‌సిస్తున్నాము. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌నఃస్పూర్తిగా ఆ దేవుడుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ స‌భ్యుల‌కు మా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాము.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*