ద‌స‌రా కానుక‌గా రాబోతున్న బోగ‌న్ తెలుగు వెర్ష‌న్

లాక్ డౌన్ త‌రువాత అక్టోబ‌ర్ 15 నుంచి థియేట‌ర్స్ 50 శాతం కెపాసిటీతో ఓపెన్ చేసుకోవ‌డానికి కేంద్రం ఆమోదం తెల‌ప‌డంతో, ఇండస్ట్రీలో నిర్మాత‌లు మ‌ధ్య చ‌ర్చలు మొద‌లైయ్యాయి, అయితే ముందుగా థియేట‌ర్స్ లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవ‌డంతో ఎగ్జీబిట‌ర్లంతా బాహుబ‌లి 2, అల‌వైకుంట‌పురంలో త‌దిర‌త హిట్ సినిమాల్ని ఆడించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ స‌మ‌యంలో కూడా ఓటిటి ల్లో డైరెక్ట్ గా సినిమాలు విడుద‌లైనా ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకోలేదు, అలానే ప‌క్క క‌మ‌ర్శీయ‌ల్ సినిమా ఒక్క‌టిగా కూడా విడుద‌ల అవ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి త‌మిళంలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన థ్రిల్ల‌ర్ మూవీ బోగ‌న్ ని తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ స్టార్ హీరో జ‌యం ర‌వి, పాన్ ఇండియా పెర్ఫార్మ‌ర్ అర‌వింద్ స్వామీ, బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా క‌మ‌ర్శీయ‌ల్ థిల్ల‌ర్ గా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అక్టోబ‌ర్ 16 నుంచి థియేట‌ర్స్ తెరుచుకునే ప‌రిస్థితులు ఉండ‌టంతో ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత రామ్ త‌ళ్లూరి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మ‌రి లాక్ డౌన్ త‌రువాత థియేట‌ర్స్ లో రిలీజ్ అవ్వ‌నున్న మొట్ట‌మొద‌టి సినిమా బోగ‌న్ అవుతుండ‌టంతో ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా చ‌ర్చించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*