రామ్‌చ‌ర‌ణ్ ఎన్ టిఆర్ ని డామినేట్ చేయ‌నున్నాడా..

ఇద్ద‌రు స్టార్ హీరోస్ ని ఒకే చిత్రం లో న‌టింప‌జేయ‌టం సాహ‌సం అనే చెప్పాలి. అది కూడా ఇద్ద‌రూ సిని ప్ర‌త్య‌ర్థులని ఒకే స్క్రీన్ మీద చూపించే సాహ‌సం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మోద‌టి టీజ‌ర్ ని ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అయితే ఈ నెల 22 న రెండ‌వ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ఇది మామూలుగా అయితే సామాన్యమైన విష‌యం కాని ఇప్ప‌డు ఇది మ‌రో సాహ‌సానికి దారి తీస్తుంది. మెద‌టి టీజ‌ర్ లో ష‌ర్ట్ విప్పి కండ‌లు చూపిస్తూ చ‌ర‌ణ్ దుమ్ము దులిపాడు.. ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ క్యార‌క్ట‌ర్ సమ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర కాబ‌ట్టి ఫైర్ చూపించాడు.

ఇప్ప‌డు కొమ‌రం భీం పాత్ర కి కూల్ వాట‌ర్ ని శాంతి అనేలా చూపించారు మెష‌న్ పోస్ట‌ర్ లో అలా చూస్తే ఈ టీజ‌ర్ లో కొమ‌రం భీం పాత్ర‌ధారి ఎన్ టి ఆర్ ని శాంతి యుతం గా చూపించ‌నున్నారా.. దానికి రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఫైర్ బ్రాండ్ అవ్వ‌నుందా.. ఇరువురి అభిమానుల‌కి ఇదే సందేహం వుంది. ఎంత వాయిస్ చెప్పినా యాక్ష‌న్ లో బాడి కండ‌లు వుండాలిగా అలా కంపేర్ చేస్తే ఎన్ టి ఆర్ ని రామ్‌చ‌ర‌ణ్ డామినేట్ చేస్తాడా అనే భ‌యం అభిమానుల్లో లేక‌పోలేదు.. కాని రాజ‌మౌళి కి తెలుసు క‌దా ఎవ‌రి ని ఎలా చూపిస్తే అభిమానులు సంతోష ప‌డ‌తారో.. 22 వ‌ర‌కూ ఆగాల్సిందే..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*