ఫ్రైడే మూవీస్‌లో దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.. తొలిరోజే రికార్డు వ్యూస్..

థియేటర్స్ మూత పడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 91818 వ్యూస్ దక్కించుకుంది. అంటే డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటల నుంచి 19 సాయంత్రం 6 గంటల మధ్యలో డర్టీ హరి సినిమాకు 91818 వ్యూస్ వచ్చాయి. ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమంది ఎన్నిసార్లైనా 24 గంటల టైమ్‌లో చూసే ఏర్పాటు ఫ్రైడే మూవీస్ ఏర్పాటు చేసింది. అది మీ స్నేహితులతో కానీ.. కుటుంబంతో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా.. కంప్యూటర్, మొబైల్, ట్యాబ్ ఇలా ఎందులో అయినా చూసుకునే అవకాశం కల్పించారు ఫ్రైడే మూవీస్. ఇప్పుడు విడుదలైన డర్టీ హరీ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమా విడుదలైనపుడు ఒకేసారి 25 వేల మంది రావడంతో ఏటిటి యాప్‌కు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. అయితే వెంటనే టెక్నికల్ టీం దీన్ని సాల్వ్ చేయడంతో వ్యూస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. గుదురు సతీష్ బాబు, గుదురు సాయి పునీత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు తెరకెక్కించారు. సస్పెన్స్, బోల్డ్ రొమాన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఎమ్మెస్ రాజు. మంచి ట్విస్టులతో పాటు ఆసక్తికరమైన కథనం ఉండటంతో డర్టీ హరి చిత్రం ప్రేక్షకులకు చేరువ అవుతుంది.

నటీనటులు:
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖ వాణి తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: ఎమ్మెస్ రాజు
నిర్మాతలు: గుదురు సతీష్ బాబు, గుదురు సాయి పునీత్
సంగీతం: మార్క్ కే రాబిన్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*