జగనన్నకు బర్త్ డే గిఫ్ట్.. రోజా చేసిన గొప్ప పని ఇది

మొదట సినిమాల్లో అగ్ర తారైంది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. అనంతరం బుల్లితెరపై జబర్ధస్త్ నవ్వులు పూయించింది. సామాజిక సేవా బతుకుజట్కా బండితో బాధితుల కష్టాలు తీర్చింది. ఇలా సినిమాలు, రాజకీయం.. బుల్లితెర మూడు విభిన్న రంగాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సత్తాను చాటుకున్నారు. అయితే రోజాలో ఈ మూడు కోణాలే కాదు.. మరో పార్శ్వం కూడా ఉంది. ఆమెలోని గొప్ప సేవా గుణం చూసి ఇప్పుడు అందరూ శభాష్ అంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సేవాతత్పరతను ఇప్పటికే చాటుకుంటున్నారు. పేదల ఆకలితీర్చేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటి సమస్యను ప్రారదోలారు. స్కూళ్లకు ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ అందించారు. నియోజకవర్గ ప్రజలకు రోజా తాగునీటిని అందించారు. ఎంతో మందికి కష్టాల్లో ఉన్న వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి సేవలందించారు. ఇప్పుడు జగనన్నకు అదిరిపోయే బర్త్ డే కానుక ఇచ్చారు.

రేపు డిసెంబర్ 21 ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు.. వైసీపీ శ్రేణులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, నేతలు పండుగలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కొందరు కేక్ కట్ చేస్తున్నారు. కొందరు పండ్లు పంచుతున్నారు. కొందరు ఏదైనా సేవ చేస్తున్నారు. కానీ అందరిలోకి విభిన్నంగా జగనన్నపై ప్రేమను చాటుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. జగన్ కు ప్రతిసారి రాఖీ కట్టే రోజా.. అన్న పుట్టిన రోజున ఓ పేదింట ఆనందాన్ని విరబూయించింది. అమ్మా నాన్న లేని ఓ అమ్మాయిని అక్కున చేర్చుకొని ఆ అమ్మాయి కలను నెరవేర్చడానికి రెడీ అయ్యింది. అదే బాలికను మెడిసిన్ చదివించేందుకు రెడీ అయ్యి అదే జగనన్న పుట్టినరోజు సందర్భంగా తాను ఇస్తున్న కానుక అని రోజా చాటిచెప్పింది.

ఓ పేదింటి బాలిక అమ్మానాన్న లేదు. పేరు పి. పుష్పకుమారి. చిన్నప్పుడే అమ్మానాన్న అనారోగ్యంతో చనిపోవడంతో కష్టపడి ప్రభుత్వ ఆశ్రమ విద్యాసంస్థల్లో చదవి 10వ తరగతిలో 10జీపీఏ సాధించింది. నీట్ లో కూడా బాగా రాసింది. కానీ తక్కువ మార్కులు రావడంతో మెడిసిన్ చదవలేకపోయింది. దీంతో ఈ బాలిక విషయం తెలుసుకున్న రోజా చలించిపోయారు. పేద అమ్మాయిని చేరదీశారు. ఆమె కోరిక మెడిసన్ చదివించాలన్నది రోజా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆమె హాస్టల్ కు వెళ్లి మరీ అమ్మాయి బాధ్యత తీసుకున్నారు. అనాథ బాలికను మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. జగనన్న బర్త్ డేకి ఆయన చెల్లెలిగా తాను పుష్ప కుమారిని చదివించడానికి బాలికను దత్తత తీసుకుంటున్నానని తెలిపింది.

అనాథ బాలికను జగనన్న బర్త్ డే సందర్భంగా దత్తత తీసుకొని చదివించడానికి రెడీ అయిన రోజా మంచి మనసును అందరూ అభినందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*